జేఈఈ మెయిన్ ఫలితాల్లో నారాయణ జయకేతనం

జేఈఈ మెయిన్ ఫలితాల్లో నారాయణ జయకేతనం

హైదరాబాద్, వెలుగు: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) విడుదల చేసిన జేఈఈ మెయిన్ 2026 సెషన్–-1 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ముగ్గురు నారాయణ విద్యార్థులు100 పర్సంటైల్ సాధించి విజయ దుందుభి మోగించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, గోవా వంటి రాష్ట్రాల్లో  స్టేట్ టాపర్లుగా నిలిచారు. 

వివన్ శరత్ మహేశ్వరి, మాధవ్ విరాడియా, నరేంద్రబాబు గారి మహిత్ 100 పర్సంటైల్ సాధించి ప్రభంజనం సృష్టించారు. కర్నాటకకు చెందిన విష్ణు సాయి తేజ 99.99 పర్సంటైల్ తో, గోవాకు చెందిన తనయ్ అజిత్ ప్రభు 99.825 పర్సంటైల్ తో ఆయా రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు సింధూర నారాయణ, శరణి నారాయణ మాట్లాడారు. 

జేఈఈ మెయిన్ పరీక్షకు నారాయణ అందిస్తున్న అనితర సాధ్యమైన శిక్షణ, రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లు, స్టడీ మెటీరియల్, వారంతపు పరీక్షల వల్లే ఈ ఘనత సాధ్యమైందని తెలిపారు. దిశ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని పెంపొదిస్తూ ఒత్తిడి లేని చదువును అందిస్తున్నామని చెప్పారు. ప్రతి విద్యార్థి లోపాలను విశ్లేషించి వ్యక్తిగత మార్గదర్శకత్వం అందించడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.