ఇద్దరు ప్రధానులు ఎడమొహం పెడమొహం

ఇద్దరు ప్రధానులు ఎడమొహం పెడమొహం

బిష్కెక్, కిర్గిస్థాన్: ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్  మొదట ఎడమొహం, పెడమొహంగా ఉన్నా చివరకు ఒకర్నొకరు పలకరించుకున్నారు.షేక్‌‌హేండ్‌‌ ఇచ్చుకున్నారు.  షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీవో) సదస్సు వేదికగా శుక్రవారం ఇద్దరు నేతలు విష్ చేసుకున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని పెద్దాఫీసర్లు చెప్పారు.  గురువారం సదస్సు ప్రారంభమైనప్పుడు ఒకర్నొకరు పలకరించుకోలేదు. డిన్నర్‌‌లోనూ మోడీ మూడు సీట్లు దూరంగా ఇమ్రాన్‌‌ ఖాన్‌‌ కూర్చున్నారు.

పాక్‌‌ ప్రధాని తడబాటు

ఎస్‌‌‌‌‌‌‌‌సీఓ సమ్మిట్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్న పాకిస్థాన్‌‌‌‌‌‌‌‌ ప్రధాని ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌ డిప్లమాటిక్‌‌‌‌‌‌‌‌ ప్రోటోకాల్‌‌‌‌‌‌‌‌ను ఉల్లంఘించారు.సమావేశ ప్రారంభంలో నేతలంతా లేచి నిలుచున్నా ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌ మాత్రం తన సీట్లోనే కూర్చున్నారు.  దీన్ని  గ్రహించి వెంటనే నిలుచున్నారు. అయితే ఆయన ఎంతోసేపు నిలుచోలేదు. మిగిలినవాళ్లకన్నా ముందుగానే  తన సీట్లో మళ్లీ కూర్చున్నారు.

ఇమ్రాన్‌‌‌‌తో జిన్‌‌‌‌పింగ్‌‌‌‌ భేటీ

ఇండియా- పాకిస్తాన్‌‌ మధ్య దెబ్బతిన్న సంబంధాలను మెరుగుపరిచేందుకు తమ వంతు కృషిచేస్తానని చైనా ప్రకటించింది. చైనా ప్రెసిడెంట్‌‌ జిన్‌‌పింగ్‌‌ పాక్‌‌ ప్రధాని ఇమ్రాన్‌‌ఖాన్‌‌ను శుక్రవారం కలిసి ఈమేరకు హామీ ఇచ్చినట్టు చైనా మీడియా ప్రకటించింది. టెర్రిరిజానికి సపోర్ట్‌‌ చేయడం పాక్‌‌ ఆపితేనే ఆదేశంతో చర్చలు జరుపుతామని గురువారం తనను కలిసిన జిన్‌‌పింగ్‌‌కు మోడీ   క్లారిటీ ఇచ్చిన ఒకరోజు తర్వాత చైనా ప్రెసిడెంట్‌‌ ఈ కామెంట్స్‌‌  చేశారు. షాంఘై  సహకార సదస్సులో పాల్గొనేందుకు బిష్కెక్‌‌ వచ్చిన పాక్‌‌ ప్రధానితో చైనా ప్రెసిడెంట్‌‌ భేటీ అయ్యారు. రెండుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడేందుకు చైనా కృషిచేస్తుందని పాక్‌‌ పీఎంకు జిన్‌‌పింగ్‌‌ హామీ ఇచ్చారు. రెండుదేశాలు సంయమనం పాటించాలని సూచించారు. మరోవైపు, రెండుదేశాల మధ్య సంబంధాలు చెప్పుకోదగ్గ రీతిలో లేవని అంతకుముందు ఇమ్రాన్‌‌ఖాన్‌‌ కామెంట్ చేశారు.

టెర్రరిస్టులకు మద్దతిచ్చే దేశాల్ని వెలేద్దాం రండి : మోడీ

టెర్రరిజాన్ని పెంచిపోషిస్తున్న పొరుగుదేశం పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ తీరును ప్రధాని నరేంద్రమోడీ మరోసారి  ఎండగట్టారు. ఆదేశ ప్రధాని ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌ సమక్షంలోనే మోడీ ఈ  అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. టెర్రరిజానికి మద్దతు ఇస్తూ టెర్రరిస్టులకు ఆర్థిక సాయం అందించే దేశాలు జవాబుదారీగా ఉండాలని  సభ్యదేశాలకు పిలుపు ఇచ్చారు. కిర్గిస్తాన్‌‌‌‌‌‌‌‌ కేపిటల్‌‌‌‌‌‌‌‌ బిష్కెక్‌‌‌‌‌‌‌‌లో రెండురోజులపాటు జరిగిన షాంఘై సహకార సదస్సు (  ఎస్‌‌‌‌‌‌‌‌సీఓ) ముగింపు కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. టెర్రరిజాన్ని సమర్థవంతంగా  ఎదుర్కోవాలన్నారు. టెర్రరిజంపై పోరాటంలో  ఎస్‌‌‌‌‌‌‌‌సీఓలోని సభ్యదేశాలన్నీ ఒకరికొకరు సాయం చేసుకోవాలని ప్రధాని కోరారు. టెర్రిరిజంలేని సమాజం కోసం ఇండియా కట్టుబడి ఉందని చెప్పారు. శ్రీలంకలో  టెర్రర్‌‌‌‌‌‌‌‌ దాడి  జరిగిన సెయింట్‌‌‌‌‌‌‌‌ ఆంథోని చర్చ్‌‌‌‌‌‌‌‌ను తాను ఈ మధ్యనే చూశానని మోడీ ఈ సందర్భంగా చెప్పారు.  అమాయకులైన ప్రజలు టెర్రరిస్టుల  ఘాతుకానికి ఎలా బలయ్యారో ఈ ఘటన చెబుతుందన్నారు.  సంకుచిత ఆలోచనల నుంచి బయటకువచ్చి టెర్రరిజాన్ని  ఎదుర్కోవడానికి దేశాలన్నీ కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా గ్లోబల్‌‌‌‌‌‌‌‌ సమావేశం నిర్వహించాలని సభ్యదేశాల నేతల్ని కోరారు.

‘‘సాహిత్యం, సంస్కృతి సమాజంలో పోజిటివ్‌‌‌‌‌‌‌‌ భావాలన్ని పెంపొందిస్తాయి. ముఖ్యంగా యూత్‌‌‌‌‌‌‌‌లో  తీవ్రవాద భావజాలాన్ని అడ్డుకట్టవేయడానికి సాహిత్యం, సంస్కృతి  సాయపడతాయి’’ అని ఆయన అన్నారు.

షాంఘై సహకార సదస్సు సభ్య దేశాల్లో సెక్యూరిటీ, సుస్థితర ఉండాలంటే ఆఫ్గనిస్తాన్‌‌‌‌‌‌‌‌లో ఐక్యంగా, శాంతియుతంగా, సురక్షితంగా ఉండాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. ఆదేశంలో శాంతి ప్రక్రియ కొనసాగేందుకు అక్కడి ప్రజలు, ప్రభుత్వానికి మనమంతా సహకరించాలని కోరారు.  ఎస్‌‌‌‌‌‌‌‌సీఓలో  సభ్యదేశంగా చేరిన రెండేళ్ల నుంచి ఇండియా అన్ని కార్యక్రమాలకు సాయం అందిస్తోందన్నారు.

‌‌‌‌‌‌‌ఎస్‌సీఓ సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ HEALTH కు కొత్త అర్థాన్ని చెప్పారు.

H అంటే హెల్త్‌‌‌‌‌‌‌‌ కేర్‌‌‌‌‌‌‌‌ కోఆపరేషన్‌‌‌‌‌‌‌‌ (ఆర్యోగ విషయంలో సహకారం)

E అంటే ఎకనమిక్‌‌‌‌‌‌‌‌ కోఆపరేషన్‌‌‌‌‌‌‌‌ (ఆర్థిక విషయంలో సహకారం )

A అంటే ఆల్టర్నే టివ్‌ ఎనర్జీ

L అంటే లిటరేచర్‌‌‌‌‌‌‌‌, కల్చర్‌‌‌‌‌‌‌‌ (సాహిత్యం, సంస్కృతి)

T అంటే టెర్రరిజం ఫ్రీ సొసైటీ ( టెర్రరిజంలే ని సమాజం)

H అంటే హ్యుమనిటేరియన్‌‌‌‌‌‌‌‌ కోపరేషన్‌‌‌‌‌‌‌‌ఎస్‌

ఎస్‌‌‌‌‌‌‌‌ఓఎస్‌‌‌‌‌‌‌‌ నేపథ్యం

  •  2001లో షాంఘైలో  ఏర్పాటు
  • సభ్యదేశాలు: 8  (ఇండియా, చైనా, రష్యా, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌, కజకిస్థాన్‌‌‌‌‌‌‌‌, తజికిస్తాన్‌‌‌‌‌‌‌‌, ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌, కిర్గిస్తాన్‌‌‌‌‌‌‌‌)
  • ఇండియా, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌లు 2017లో సభ్యులుగా చేరాయి
  • అబ్జర్వెర్లుగా పాల్గొంటున్న దేశాలు: ఆఫ్గనిస్తాన్‌‌‌‌‌‌‌‌, బెలారస్‌‌‌‌‌‌‌‌, ఇరాన్‌‌‌‌‌‌‌‌, మంగోలియా

బిష్కెక్‌‌‌‌‌‌‌‌ డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌

శుక్రవారంతో ముగిసిన షాంఘై సహకార సదస్సు బిష్కెక్‌‌‌‌‌‌‌‌ డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసింది.  టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా  మట్టుపెట్టాల్సిందేనని పిలుపునిచ్చింది. దీనికోసం సభ్య దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలంది. టెర్రరిజాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించరాదని  కోరింది.   టెర్రరిస్టులు, సెపరేటిస్టుల గ్రూపుల్లో  యువకులు చేరకుండా  అడ్డుకట్టవేయాలంది. మత సహనం పెంపొందించాలని, రంగు ఆధారంగా మనుషలమధ్య భేదాలు సృష్టించకూడదని తెలిపింది. ‘టెర్రరిజంపై పోరు’ అన్న సాకుతో ఇతర దేశాల సొంత విషయాల్లో జోక్యం చేసుకోరాదని  కోరింది. కెమికల్‌‌‌‌‌‌‌‌, బయోలాజికల్‌‌‌‌‌‌‌‌ టెర్రరిజం నుంచి ఎదురయ్యే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి దాన్ని మట్టుపెట్టాలని ఆఫ్గనిస్తాన్‌‌‌‌‌‌‌‌లో శాంతికి, ఆదేశ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరింది.

పాక్​ మీదుగా విమానాలు ఎగరకుండా మళ్లీ నిషేధం

లాహోర్: ఇండియా తూర్పు సరిహద్దుల గుండా ఎయిర్​ట్రావెల్​ను నిషేధిస్తూ పాకిస్థాన్ సివిల్​ఏవియేషన్​అథారిటీ(సీఏఏ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 28 వరకు ఎయిర్​స్పేస్​బ్యాన్​కొనసాగుతుందని సీఏఏ తెలిపింది. పశ్చిమంవైపున్న పంజుగూర్​ఎయిర్​స్పేస్​పై ఎలాంటి నిషేధం లేదని పేర్కొంది. ఈ రూట్లో ఇండియన్ విమానాల రాకపోకలు జరుపుతున్నాయని వివరించింది. తూర్పు వైపు బ్యాన్​ఎత్తేసే విషయంలో ఇండియాతో సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. బిష్కెక్​సదస్సు కోసం మోడీ ప్రయాణించే విమానానికి దారివ్వాలంటూ ఇండియా విజ్ఞప్తి చేసింది. దీనికి సానుకూలంగా స్పందించిన పాక్.. తాత్కాలికం గా ఎయిర్ స్పేస్​బ్యాన్​ఎత్తేసింది.