నేడే విశాఖకు మోడీ

నేడే విశాఖకు మోడీ

ప్రధాని మోదీ శుక్రవారం విశాఖపట్నం వెళ్లనున్నారు. ఆయన పర్యటనకు బీజేపీ నాయకులు భారీ ఏర్పాట్లుచేశారు. ఎన్నికల వేడి రాజుకుంటున్న సమయంలో రాష్ట్రానికి వస్తున్న ప్రధాని.. విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వే జోన్‌ తోనే సరిపెడతారా.. కొత్త/పాత వరాలు గుప్పిస్తారా.. లేక గుంటూరు సభలో మాదిరిగా సీఎం చంద్రబాబుపై దుమ్మెత్తిపోయడానికే పరిమితమవుతారా అని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించి మసిపూసి మారేడుకాయ చేశారని, దాని వల్ల ఏపీకి ఒరిగే ప్రయోజనం ఏమీ లేదంటూ ప్రధానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రూ.6,500 కోట్ల కార్గో రాబడి ఉన్న కె.కె. లైన్ ను రాయగఢ్‌ లో చేర్చి ఏపీకి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. వాల్తేరు డివిజన్‌‌ రద్దు పుండు మీద కారం జల్లడమే అన్నారు.