చెర్వుగట్టు ఆలయ అభివృద్ధికి కృషి..శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం పాలకవర్గం ప్రమాణస్వీకారం

చెర్వుగట్టు ఆలయ అభివృద్ధికి కృషి..శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం పాలకవర్గం ప్రమాణస్వీకారం

నార్కట్​పల్లి, వెలుగు: చెర్వుగట్టు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. సోమవారం శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో పాలకవర్గం ప్రమాణస్వీకారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. 

రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాన్ని అన్నిరంగాల్లో డెవలప్  చేసేందుకు రూ.100 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వచ్చే నెలలో సీఎం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. కొత్త కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. 

చైర్మన్​ వారాల రమేశ్, డైరెక్టర్లను సన్మానించారు. ఈవో మోహన్​బాబు, పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల ఊశయ్య, సర్పంచులు నేతగాని కృష్ణయ్య, లింగస్వామి, భరత్, డైరెక్టర్లు కమ్మలపల్లి మల్లేశ్, రేగటి శ్రీనివాస్ రెడ్డి, సంపత్, సత్యనారాయణ, లింగస్వామి, శీను, నరసింహ, శ్రవణ్ కుమార్, నల్ల అనిత, మహేశ్, రఘునాథ్, యాదయ్య, లక్ష్మయ్య, పోతులపాటి రామలింగేశ్వర శర్మ పాల్గొన్నారు.