ఇంటర్ స్టూడెంట్స్.. 100 స్పీడ్.. అక్కాచెల్లెళ్లు మృతి.. నిజాంపేటలో విషాదం

ఇంటర్ స్టూడెంట్స్.. 100 స్పీడ్.. అక్కాచెల్లెళ్లు మృతి.. నిజాంపేటలో విషాదం

అందరూ ఇంటర్మీడియట్ కుర్రోళ్లు.. అందరి వయస్సు 20 ఏళ్లలోపు.. మొత్తం 12 మంది స్టూడెంట్స్.. అందరూ ఉండేది కూకట్ పల్లి నిజాంపేట, బాచుపల్లిలోనే..  హాలీడేస్ లో ఎంజాయ్ చేయటం కోసం ఫ్రెండ్ అందరూ కలిసి రిసార్ట్స్ వెళదాం అని ఫిక్స్ అయ్యారు.. దీంతో 7 సీటర్ కారును తీసుకుని.. అందులో 12 మంది ఎక్కారు.. ప్రసాద్ అనే స్టూడెంట్ డ్రైవ్ చేస్తున్నాడు.. అసలే కుర్రోడు.. ఆపై ఫుల్ స్పీడ్ లో వెళుతున్నాడు.. కారు స్పీడ్ 100 కిలోమీటర్లపై ఉండగా.. ఓ బస్సును ఓవర్ టేక్ చేయటానికి ప్రయత్నించి.. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. కారు రైట్ సైడ్.. అతి వేగంతో లారీ వెనక భాగాన్ని ఢీకొనటంతో.. రైట్ సైడ్ కూర్చున్న నలుగురు స్టూడెంట్స్ చనిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా ఫలితం లేకుండా పోయింది. కారు నుజ్జునుజ్జు అయ్యింది.  హైదరాబాద్ సిటీ శివార్లలోని నార్సింగ్ దగ్గర జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం తొమ్మిది కుటుంబాల్లో విషాదం నింపింది. 

యాక్సిడెంట్ జరిగిన వెంటనే కారులోనే హర్షిత, అంకిత అనే సొంత అక్కాచెల్లెళ్లు చనిపోయారు. అదే ప్రమాదంలో నితిన్, అమృత్ అనే ఇద్దరు స్టూడెంట్స్ సైతం చనిపోయారు. మిగతా వాళ్లకు త్రీవ గాయాలు అయ్యాయి.  గాయపడ్డ వారికి మెహదీపట్నం ప్రీమియర్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్న ప్రసాద్ అనే కుర్రోడు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పదో తరగతి చదువుతూ మధ్యలోనే మానేశాడు. 

నార్సింగ్ దగ్గర జరిగిన కారు ప్రమాదంతో నిజాంపేట, బాచుపల్లిలో విషాదం నెలకొంది. ఈ స్టూడెంట్స్ అందరూ ఇటీవలే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు.. ఉన్నత చదువుల కోసం ప్రిపేర్ అవుతున్నారు. యాక్సిడెంట్ వార్త తెలిసిన వెంటనే ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. అంకిత, హర్షిత పేరంట్స్ అయితే షాక్ లో ఉన్నారు. ఒకే రోజు తమ ఇద్దరు పిల్లలు చనిపోవటాన్ని జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ఎంజాయ్ చేసి వస్తాం అని చెప్పిన పిల్లలు.. ఇక తిరిగి రాని లోకానికి వెళ్లారనే విషయం తెలిసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. 

చిన్న వయస్సు కావటం.. కారు డ్రైవింగ్ లో అనుభవం లేకపోవటం ఒకటి అయితే.. ఓవర్ స్పీడ్ అనేది యాక్సిడెంట్ కు ప్రధాన కారణంగా చెబుతున్నారు పోలీసులు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు పోలీసులు.