అస్ట్రేలియాకు బిగ్ షాక్.. నాథన్ లియాన్ ఔట్

అస్ట్రేలియాకు బిగ్ షాక్..  నాథన్ లియాన్ ఔట్

యాషెస్ సిరీస్‌లో వరుసగా రెండు టెస్టు మ్యాచ్ లు గెలిచి మంచి ఊపు మీదున్న అస్ట్రేలియా క్రికెట్ టీమ్ కు బిగ్ షాక్ తగిలింది. రెండో టెస్టు మ్యాచ్ లో గాయపడిన స్పిన్నర్ నాథన్ లియాన్  మిగితా టెస్టు మ్యాచ్ లకు దూరమయ్యాడు. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో రెండవ రోజు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు లియాన్ గాయానికి గురయ్యాడు. అతని స్థానంలో టాడ్ మర్ఫీని జట్టులోకి తీసుకున్నారు.  

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో నాథన్ లియాన్ ఒక వికెట్ తీశాడు.  లియాన్ కూడా ఇప్పటి వరకు గాయం కారణంగా ఒక టెస్టుకు కూడా దూరం కాలేదు. 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన తర్వాత అతను 2013 యాషెస్ సిరీస్‌లోని మొదటి రెండు టెస్టులకు దూరంగా ఉన్నాడు. 2023  జూలై 06 నుంచి ఇంగ్లండ్ తో హెడింగ్లీలో మూడో టెస్టు మ్యాచ్ స్టార్ట్ కానుంది.  

ALSO READ:ఓటీటీలో ఈవారం ఏకంగా 24 సినిమాలు..

మూడో టెస్టు కోసం ఆస్ట్రేలియా జట్టు : 

పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవెన్ స్మిత్ (వైస్ కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్), మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్, మైఖేల్ నేజర్, మార్కస్ హారిస్, మిచెల్ మార్ష్, జిమ్మీ పీర్సన్ (వికెట్ కీపర్)