
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు చేశారు. రైతుల నిరసనలకు మద్దతుగా నిలుస్తున్న వారిపై ఐటీ శాఖ దాడులు చేయడాన్ని కేజ్రీవాల్ ఖండించారు. అన్నదాతల నిరసనలను బలహీనపర్చడానికి ఇలాంటి బలవంతపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని మండిపడ్డారు.
‘రైతుల ఆందోళనలకు మద్దతుగా నిలిచిన పంజాబ్‌కు చెందిన ఓ బిజినెస్‌మేన్ మీద కేంద్రం ఇన్‌కమ్ ట్యాక్స్‌తో రెయిడ్‌లు చేయించింది. సదరు వ్యాపారిని అలా వేధించడం చాలా తప్పు. అన్నదాతల ఉద్యమాన్ని బలహీనం చేయాలని యత్నిస్తున్నారు. ఇవ్వాళ దేశం మొత్తం రైతుల పక్షాన ఉంది. మరి కేంద్ర ప్రభుత్వ రెయిడ్‌లకు మద్దతుగా ఎవరున్నారు?’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.