విశాక ఇండస్ట్రీస్​కు ..నేషనల్ అచీవర్స్ రీకగ్నైజేషన్ ఫోరం అవార్డు

విశాక ఇండస్ట్రీస్​కు ..నేషనల్ అచీవర్స్ రీకగ్నైజేషన్ ఫోరం అవార్డు

న్యూఢిల్లీ,వెలుగు : విశాక ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్ అచీవర్స్ రీకగ్నైజేషన్ ఫోరం అవార్డు’ వరించింది. ‘మిషన్ వీ’ కాన్సెప్ట్ కు గాను ‘బెస్ట్ క్రియేటీవ్ బ్రాండ్ అవార్డు’ దక్కింది. గురువారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన ప్రోగ్రామ్​లో ఉత్తరాఖండ్ మాజీ సీఎం, ఎంపీ తిరత్ సింగ్ రావత్ చేతుల మీదుగా విశాక ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ క్రియేటివ్ డైరెక్టర్ డా.సిద్దేశ్వర్ మనోజ్, బిజినెస్ హెడ్ సునీల్ ఈ అవార్డును అందుకున్నారు. తర్వాత సునీల్ మాట్లాడుతూ... ‘మిషన్ వీ’ కాన్సెప్ట్ కు బెస్ట్ క్రియేటీవ్ బ్రాండ్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. దీంతో పాటు బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ అవార్డులు కూడా విశాక టీమ్​కు దక్కాయని తెలిపారు. ‘ఇన్ హౌజ్’లో విశాక రూపొందించిన కాన్సెప్ట్ కు అవార్డు రావడం బిగ్ అచీవ్ మెంట్ అని అన్నారు. ఇలాంటి కాన్సెప్ట్ లకు జాతీయ స్థాయిలో చాలా అరుదుగా గుర్తింపు వస్తుందన్నారు. తెలంగాణ నుంచి ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉందన్నారు.

గో-గ్రీన్ నినాదంతో వీ నెక్స్ట్ ప్రాజెక్ట్

భవన నిర్మాణాల్లో ప్రతి యేటా కోట్లాది చెట్లను నరికేస్తున్నారని, వాటిని నరక కుండా విశాక టీం గో–గ్రీన్ నినాదంతో వీ నెక్స్ట్ ప్రాజెక్ట్ రూపొందించిందని విశాక క్రియేటివ్ డైరెక్టర్ డా.సిద్దేశ్వర్ మనోజ్ తెలిపారు. ఎన్విరాన్మెంట్ ను కాపాడేందుకు ‘వీ నెక్స్ట్’ను లాంచ్ చేసినట్లు తెలిపారు. వర్షం, రియాల్టీ, భారీ చెట్లు చూపించేలా మేఘాలయలో ఈ కాన్సెప్ట్ చిత్రీకరించామన్నారు. చెట్లను కాపాడుతూ.. ప్లాస్టిక్ ను నిర్మూలించేలా కాన్సెప్ట్ రూపొందించినట్లు తెలిపారు. ఈ కాన్సెప్ట్ రూపకల్పనలో విశాక యాజమాన్యం.. ముఖ్యంగా వివేక్, వంశీ, సునీల్ అన్ని విధాలుగా సహకారం అందించారని సిద్దేశ్వర్ మనోజ్ వివరించారు. ప్రతి నెలా ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ తో ప్రజల ముందుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.