పుష్పతో టాలీవుడ్ గర్వపడేలా చేసిన అల్లు అర్జున్

పుష్పతో టాలీవుడ్ గర్వపడేలా చేసిన అల్లు అర్జున్

ఎంతో ఘనచరిత్ర కలిగిన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలతో పాటు  గొప్ప క్లాసిక్ సినిమాలు కూడా వచ్చాయి.  అద్భుతంగా నటించే గొప్ప నటులు కూడా ఉన్నారు. కానీ ఇంతకాలం ఉత్తమ నటుడు అనే కేటగిరీలో అవార్డు రావడం అందని ద్రాక్షగానే మిగిలింది. నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం ప్రారంభించి 69 ఏళ్లు అవుతున్నా.. యాక్టర్స్‌‌, టెక్నీషియన్స్‌‌కు అవార్డ్స్ ఇస్తోంది మాత్రం 1967 నుంచే.

ఈ యాభై నాలుగేళ్లలో ఇప్పటివరకూ హిందీ నుంచి 25 మంది, మలయాళం నుంచి 14 మంది, తమిళం నుంచి 9 మంది, బెంగాలీ నుంచి ఐదుగురు, కన్నడ, మరాఠీ భాషల నుంచి చెరో ముగ్గురు, ఇంగ్లీష్ నుంచి ఇద్దరు ఈ అవార్డును అందుకున్నారు. సౌత్‌‌ నుంచి కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‌‌లాల్, విక్రమ్, ధనుష్, సూర్య లాంటి కొందరు నటులు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు.

దక్షిణాది నుంచి ఈ కేటగిరీలో అవార్డును ఒక్కసారి కూడా అందుకోని సినిమా ఇండస్ట్రీ తెలుగు చిత్ర పరిశ్రమే కావడం గమనార్హం. సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు దీన్ని నమ్మడం కష్టమే. ఆ విషయంలో ఈసారి బెస్ట్ యాక్టర్‌‌‌‌గా నేషనల్ అవార్డ్ సాధించి టాలీవుడ్ గర్వపడేలా చేశాడు అల్లు అర్జున్.