సీఎంను కలిసిన జాతీయ సైక్లిస్ట్‌ ఆశా మాల్వియ

సీఎంను కలిసిన జాతీయ సైక్లిస్ట్‌ ఆశా మాల్వియ

 హైదరాబాద్, వెలుగు: అథ్లెట్, ప్రముఖ జాతీయ సైక్లిస్ట్‌ ఆశామాల్వియ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ఆదివారం కలిశారు. కార్గిల్ దివస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఆశా మాల్వియా కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. జూన్‌ 24వ తేదీన ప్రారంభమైన ఈ సైకిల్‌ యాత్ర ఆదివారం హైదరాబాద్‌ చేరుకుంది.ఈ క్రమంలోనే ఆమెను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

 ఆశా మాల్వియా మధ్యప్రదేశ్ కు చెందినవారు. గతంలోను మహిళల భద్రత, సాధికారత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు 28 రాష్ట్రాల్లో 25 వేల కిలోమీటర్ల మేర సోలో సైకిల్ యాత్ర చేపట్టి సైక్లిస్ట్ గా ఎన్నో రికార్డులు సృష్టించారు.