నిరుద్యోగులకు మంచి ఛాన్స్.. NHPCలో భారీగా ఉద్యోగాలు.. కనీస అర్హత ఉన్న చాలు..

నిరుద్యోగులకు మంచి ఛాన్స్.. NHPCలో భారీగా ఉద్యోగాలు.. కనీస అర్హత ఉన్న చాలు..

నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్​హెచ్​పీసీ) నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  

పోస్టుల సంఖ్య: 248.

పోస్టులు: అసిస్టెంట్ రాజ్యభాష ఆఫీసర్ (ఈ01) 11, జూనియర్ ఇంజినీర్(సివిల్ ఎస్ఓ01) 109, జూనియర్ ఇంజినీర్(ఎలక్ట్రికల్ ఎస్ఓ01) 46, జూనియర్ ఇంజినీర్ (మెకానికల్ ఎస్ఓ01) 49, జూనియర్ (ఈ&సీ ఎస్ఓ01) 17, సీనియర్ అకౌంటెంట్ (ఎస్ఓ01) 10,
సూపర్​వైజర్ (ఐటీ ఎస్ఓ01) 01, హిందీ ట్రాన్స్​లేటర్ (డబ్ల్యూ06) 05. 

ఎలిజిబిలిటీ:  అసిస్టెంట్ రాజ్యభాష ఆఫీసర్ పోస్టులకు హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టులుగా ఎంఏ, జూనియర్ ఇంజినీర్ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమా, కనీసం 60 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్, ఐటీలో బి.టెక్, బీసీఏ/ బీఎస్సీ, సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు సీఏ ఇంటర్/ సీఎంఏ ఇంటర్, హిందీ ట్రాన్స్​లేటర్ పోస్టులకు హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టులుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.  

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం:  సెప్టెంబర్ 02. 

లాస్ట్ డేట్: అక్టోబర్ 01. 

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.nhpcindia.com వెబ్​సైట్​లో సంప్రదించగలరు.