
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ (ఎన్ఐఐ) సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.
పోస్టులు: ఎస్ఆర్ఎఫ్/ జేఆర్ఎఫ్.
ఎలిజిబిలిటీ: సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు కెమిస్ట్రీ లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ లేదా ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో ఎం.ఫార్మాతోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి. జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు మెడికల్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ లేదా బయోకెమిస్ర్టీలో ఎంఎస్సీ లేదా ఫార్మాకాలజీలో ఎం.ఫార్మాతోపాటు జాతీయ స్థాయిలో ఏదైనా పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 08.
అప్లికేషన్ ఫీజు: మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.100.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.nii.res.in వెబ్సైట్లో సంప్రదించగలరు.