వరంగల్ ఎన్ఐటీలో రీసెర్చ్ పోస్టులు: బీటెక్/ఎంటెక్ అభ్యర్థులకు మంచి అవకాశం.

వరంగల్ ఎన్ఐటీలో రీసెర్చ్ పోస్టులు:  బీటెక్/ఎంటెక్ అభ్యర్థులకు  మంచి  అవకాశం.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ (ఎన్‌ఐటీ వరంగల్) జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. లాస్ట్ డేట్ ఫిబ్రవరి 15.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో నాలుగేండ్ల బీఎస్సీ/  ఇంటిగ్రేటెడ్ బీఎస్–-ఎంఎస్/ ఎంఎస్సీ/ బీఈ/ బి.టెక్./ ఎం.టెక్. లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. నెట్/ గేట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 28 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 15.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు nitw.ac.in వెబ్​సైట్​ను సందర్శించండి.