కాకా జయంతి వేడుకలను అధికారికంగా జరపాలి

కాకా జయంతి వేడుకలను అధికారికంగా జరపాలి
  •    రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మాలల ఐక్య వేదిక డిమాండ్

హైదరాబాద్, వెలుగు: రాజకీయ కురువృద్ధుడు, తెలంగాణ ఉద్యమకారుడు గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతి వేడుక, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జాతీయ మాలల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. హైదరాబాద్​లో మాలల ఐక్యవేదిక కార్యవర్గ సమావేశం సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఉన్న కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాలల ఐక్య వేదిక ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కాకా జయంతి, వర్ధంతిని విస్మరిస్తోందని ఆరోపించారు. వెంకటస్వామి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప రాజకీయ నాయకుడని  గుర్తు చేశారు. కాకా జయంతి వేడుకలు, వర్ధంతిని అధికారికంగా నిర్వహించకుండా ప్రభుత్వం అవమానపరుస్తోందని అన్నారు. దీనికి కారణాలేంటో చెప్పాలని డిమాండ్​ చేశారు. అక్టోబర్ 5న కాకా జయంతి వేడుకలను అధికారికంగా జరపాలని లేదంటే ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.