ఇయ్యాల్టి నుంచి సిటీలో నేషనల్ ర్యాంకింగ్ ​టీటీ

ఇయ్యాల్టి నుంచి సిటీలో నేషనల్ ర్యాంకింగ్ ​టీటీ

హైదరాబాద్,వెలుగు: యూటీటీ నేషనల్‌‌ ర్యాంకింగ్‌‌ టేబుల్‌‌ టెన్నిస్‌‌ టోర్నమెంట్‌‌ ఆదివారం నుంచి సిటీలో జరగనుంది. మొయినాబాద్‌‌లోని ఫైర్‌‌ఫాక్స్‌‌ స్పోర్ట్స్‌‌, రిసార్ట్స్​లో ఈ నెల 9 వరకు పోటీలు ఉంటాయి. మెన్స్‌‌, విమెన్స్‌‌ సింగిల్స్​తో పాటు  అండర్‌‌11, 13, 15,17,19 యూత్‌‌ బాయ్స్‌‌, గర్ల్స్​లో మొత్తం 1,900 ఎంట్రీలు వచ్చాయని శనివారం జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ టీటీ సంఘం ప్రెసిడెంట్‌‌ మహేశ్వరి వెల్లడించారు. జనరల్‌‌ సెక్రటరీ నాగేందర్‌‌ రెడ్డి, ట్రెజరర్ ఇబ్రహీం ఖాన్‌‌, వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ నరేశ్‌‌ రెడ్డి, టోర్నీ డైరెక్టర్‌‌ గణేశన్‌‌ పాల్గొన్నారు.