హైదరాబాద్, వెలుగు: యూటీటీ నేషనల్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో వెంకట మహిమ కృష్ణ శుభారంభం చేసింది. మొయినాబాద్‌లోని ఫైర్‌ఫాక్స్ స్పోర్ట్స్, రిసార్ట్స్‌లో ఆదివారం జరిగిన అండర్13 గర్ల్స్ సింగిల్స్‌లో తొలి రౌండ్‌లో మహిహ 3–2తో సాంగేల్కర్ (మహారాష్ట్ర)ను ఓడించింది. అండర్11 సింగిల్స్‌లో అపర్ణ 3–2తో బెంగాల్‌కు చెందిన మాన్వి ఘోష్‌ను ఓడించి తదుపరి రౌండ్‌కు చేరుకుంది. ఆరు రోజుల పాటు జరిగే ఈ టోర్నీని అంతకుముందు టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ కమలేశ్ మెహతా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీటీ ప్రెసిడెంట్ కె.కె. మహేశ్వరి, జనరల్ సెక్రటరీ నాగేందర్ రెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
