నార్వే: ప్రపంచాన్ని కుదిపేస్తున్న హార్ముజ్ సంక్షోభంపై నాటో చీఫ్ మార్క్ రుట్టే కీలక వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్ తెరవకుంటే ప్రపంచం షట్ డౌన్ అయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఉన్న మార్గాలపై మిత్రదేశాలు చర్చిస్తున్నట్లు గురువారం ఉత్తర నార్వేలో జరుగుతున్న నాటో సైనిక విన్యాసాల సందర్భంగా వెల్లడించారు.
హార్మూజ్ మూసివేత ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం తప్పదనే ఆందోళన వ్యక్తం చేశారు. నాటో మిత్రదేశాలన్నీ కలిసి దీనికి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు.
