హైదరాబాద్, వెలుగు: చిల్ర్డన్స్ డే(ఈ నెల14న ) రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సర్కారు స్కూళ్లలో టీచర్ పేరెంట్స్ సమావేశాలు (పీటీఎం) నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీచేశారు. గవర్నమెంట్, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ‘మన పిల్లలకు ఆనందకరమైన బాల్యాన్ని అందించడం’ థీమ్‌తో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమావేశానికి పేరెంట్స్ అందరూ అటెండ్ అయ్యేలా హెడ్మాస్టర్లు, టీచర్లు కృషి చేయాలని, ముందుగానే వారికి ఆహ్వానాన్ని పంపించాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేరెంట్స్ వ్యవసాయ పనులు, పట్టణ ప్రాంతాల్లోని పేరెంట్స్ ఇతర పనుల్లో ఉంటారు కాబట్టి, ఎక్కువ మందికి అనుకూలమైన టైమ్‌లోనే ఈ సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
