మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డిపై కత్తులతో దాడి

మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డిపై కత్తులతో దాడి

గతంలో ఆదిభట్లలో ఓ కిడ్నాప్ కేసు సంచలనం సృష్టించింది. నవీన్ రెడ్డి అనే యువ పారిశ్రామికవేత్త మిస్టర్ టీ వ్యవస్థాపకుడు. తాను ఇష్టపడిన అమ్మాయిని తనకు కాదని వేరే వాళ్లతో పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారన్న కోపంతో.. వాళ్ల ఇంటిపైకి దాడికి వెళ్లాడు నవీన్. ప్రేమించిన వైశాలిని కిడ్నాప్ చేశాడు. అందరూ చూస్తుండగా.. సుమారు వంద మందితో ఇంటిని ఇంటికి వచ్చి అమ్మాయిని ఎత్తుకెళ్లాడు. ఈరోజు నవీన్ రెడ్డిపై హస్తినపురనంలో దాడి జరిగింది. దాడికి వ్యాపార లావాదేవీలే కారణమని తెలుస్తోంది.

ఈ ఘటన కాస్త సంచలనంగా మారింది. తాజాగా సోమవారం రాత్రి నవీన్ రెడ్డిపై దాడి జరిగింది. హస్తినపురంలోని ఓ హోటల్ వద్ద ముగ్గురు వ్యక్తులు నవీన్ రెడ్డిపై కత్తితో దాడి చేశారు. ఆర్ధిక లావాదేవీలు కారణంగా రాము, మరో ఇద్దరు వ్యక్తులు నవీన్ రెడ్డిపై దాడి చేశారు. నవీన్ రెడ్డి చేతి, బుజంపై గాయాలు అయ్యాయి. వెంటనే సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ లో కేస్ నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.