హైదరాబాద్: ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం (నవంబర్26) స్పీకర్ చాంబర్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ నవీన్ యాదవ్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్ , డిప్యూటీ మేయర్ శ్రీలతరెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
నవంబర్ 14న వెలువడిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించారు బీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రెండో స్థానంలో నిలవగా బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. మొదటి రౌండ్ మినహా అన్ని రౌండ్లలో తన మెజార్టీని ప్రదర్శిస్తూ నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. బీఆర్‌ఎస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించి విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున గెలుపు సంబరాలు జరుపుకున్నారు.
