రేపు ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం

రేపు ఎమ్మెల్యేగా  నవీన్ యాదవ్ ప్రమాణం

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ బుధవారం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో ప్రమాణం చేయనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్.. నవీన్ యాదవ్​తో  ప్రమాణం చేయించనున్నారు. 

తన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి అనుచరులు, పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు అసెంబ్లీకి తరలిరావాలని నవీన్ యాదవ్ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని పలుచోట్ల దీనిపై ఇప్పటికే వాల్ పోస్టర్లు కూడా అంటించారు.  ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా పలువురు మంత్రులను కూడా  నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేశారు.