ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు...

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు...

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది..  శనివారం ( జనవరి 24 ) నవీ  ముంబైలోని MIDC ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న బీటాకెమ్ కెమికల్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగిన క్రమంలో పరిసర ప్రాంతాల జనం ఉలిక్కిపడ్డారు. భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతం అంతా నల్లటి పొగ వ్యాపించి భయానక వాతావరణం నెలకొంది. 

చాలా దూరం నుంచి కూడా మంటలు కనిపిస్తున్నాయి అంటే ప్రమాద తీవ్రత ఎంతుందో అర్థం చేసుకోండి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

షార్ట్ సర్క్యూట్ కారణమా..? కెమికల్ రియాక్షనా.. ?

అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ కానీ.. కెమికల్ రియాక్షన్ కానీ కారణమై ఉండచ్చని భావిస్తున్నారు. అయితే, మంటలను పూర్తిగా అదుపులోకి వచ్చాక, దర్యాప్తు నిర్వహించిన తర్వాతే ఖచ్చితమైన కారణం తెలుస్తుందని అంటున్నారు అధికారులు.

Also Read : 15 కోట్ల G mail, FB, NF పాస్ వర్డ్స్ లీక్

అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. సమీపంలోని పారిశ్రామిక యూనిట్లకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు ఫైర్ సిబ్బంది.

దట్టమైన పొగ కమ్మేయడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి, ఎటువంటి గాయాలు కానీ.. ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.