15 కోట్ల G mail, FB, NF పాస్ వర్డ్స్ లీక్ : ఏంటీ అన్నీ 12345.. ఇలానే ఉన్నాయా..?

15 కోట్ల G mail, FB, NF పాస్ వర్డ్స్ లీక్ : ఏంటీ అన్నీ 12345.. ఇలానే ఉన్నాయా..?

ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల పాస్ వర్డ్స్ లీక్ అయ్యాయంట.. ఈ పాస్ వర్డ్స్ అన్నీ జీ మెయిల్, ఫేస్ బుక్, నెట్ ఫ్లిక్స్ అకౌంట్లతో లింక్ అయ్యి ఉన్నాయంట.. ఇన్ని కోట్ల పాస్ వర్డ్స్ లీక్ కావటం తరచుగానే జరుగుతుంది. కోట్ల సంఖ్యలో పాస్ వర్డ్స్ లీక్ కావటం వెనక.. ఆయా అకౌంట్ హోల్డర్స్ నిర్లక్ష్యమా లేక స్ట్రాంగ్ పాస్ వర్డ్ లేకపోవటమా అనే ఇంట్రస్టింగ్ డిస్కషన్‏ ఆన్ లైన్‎లో నడుస్తుంది. ఈ 15 కోట్ల పాస్ వర్డ్స్ అన్నీ 12345.. ABCDE.. 1098765.. ఇలాగే ఉన్నాయా ఏంటీ అనే కామెడీ పోస్టులు సోషల్ మీడియాలో పడుతున్నాయి. 15 కోట్ల పాస్ వర్డ్స్ లీక్ వ్యవహారంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‎లో దాదాపు 15 కోట్ల పాస్ వర్డ్స్ లీక్ అయ్యాయని ప్రముఖ డేటా భద్రతా విశ్లేషకుడు జెరెమియా ఫౌలర్ సంచలన విషయం బయటపెట్టారు. జీమెయిల్, ఫేస్ బుక్, క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫామ్ బినాన్స్, యాహూ, మైక్రోసాఫ్ట్ ఔట్ లుక్, ఆపిల్ ఐక్లౌడ్, నెట్ ఫ్లిక్స్, టిక్ టాక్ వంటి యాప్ యూజర్ల లాగిన్ వివరాలు ఇంటర్నెట్‎లో బహిర్గతమైనట్లు చెప్పడంతో సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతున్నాయి. 

48 మిలియన్ల జీమెయిల్, 17 మిలియన్ల ఫేస్ బుక్, 420,000 బినాన్స్ యాప్‎ యూజర్లతో పాటు పలు విద్యా సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థలతో చెందిన  మిలియన్ల కొద్దీ పాస్‌వర్డ్‌లు అలాగే  బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ లాగిన్ వివరాలు లీకైన డేటాలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇన్ఫోస్టీలర్ మాల్వేర్ ఉపయోగించి యూజర్ల పాస్ వర్డ్స్ దొంగలించినట్లు ఫౌలర్ అనుమానం వ్యక్తం చేశాడు.

 ఈ హానికరమైన సాఫ్ట్‌వేర్ కంప్యూటర్లలోకి పంపి కీస్ట్రోక్ ట్రాకింగ్ వంటి పద్ధతులను ఉపయోగించి వినియోగదారు పేర్లు, పాస్‌వర్డ్‌లతో సహా వ్యక్తులు టైప్ చేసే వాటిని రికార్డ్ చేస్తారని.. ఆ తర్వాత దొంగిలించబడిన సమాచారం మాల్వేర్‌ను నియంత్రించే వారికి తిరిగి పంపుతోందని తెలిపారు. పాస్ వర్డ్స్ వీక్‎గా ఉండటం లీక్ కావడానికి ప్రధాన కారణమని వెల్లడించారు.

12345.. ABCDE, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్స్ పాస్ వర్డ్స్‎గా పెట్టుకోవడం వల్ల లీక్ అయ్యే ఆస్కారం ఎక్కువగా ఉందన్నారు. లీక్ అయిన డేటా సైబర్ నేరస్థుల చేతికి చిక్కే అవకాశం ఉందని.. ఇదే జరిగితే యూజర్ల వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఈ భారీ డేటా బ్రీచ్‎పై సోషల్ మీడియాలో ఆందోళనతో పాటు సెటైర్లు పేలుతున్నాయి. 

మనోళ్లు పాస్ వర్డ్‎లు పెట్టుకోవడానికి పెద్దగా కష్టపడరని.. బ్రెయిన్‎కు పని చెప్పరని.. సింపుల్‎గా 12345, ABCD లేదా ఫోన్ నెంబర్లు, డేట్ ఆఫ్ బర్త్‎లు పెడతారని.. తద్వారా స్కామర్ల పని ఈజీ చేస్తున్నారని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. లీకైన 15 కోట్ల పాస్ వర్డ్స్ లో దాదాపు 90 శాతం ఈ కోవకు చెందినవే ఉంటాయంటున్నారు. సో.. ఇప్పటికైనా మేల్కొని పాస్ వర్డ్స్‎ను స్ట్రాంగ్‎గా పెట్టుకోండి. ఫోన్ నెంబర్లు, డేట్ ఆఫ్ బర్త్‎లు కాకుండా పాస్ వర్డ్‎ను పటిష్టంగా సెట్ చేసుకోండి. లేదంటే స్కామర్ల చేతికి చిక్కి చివరకు లబోదిబోమని గుండెలు బాదుకోవాల్సి వస్తది.