
వివాహిత మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సబ్-ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదు అయ్యింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబై టౌన్‌షిప్‌లో చోటుచేసుకుంది. కానిస్టేబుల్‌పై అత్యాచారం, వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఎస్ఐపై ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. 2020, జూలై 2022 మధ్య సంపాద ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీస్ అధికారి చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు బాధితురాలితో స్నేహంగా దగ్గరయ్యాడు. ఇద్దరూ సాన్‌పాడ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి బాధితురాలిపై సాన్‌పాడలోని ఓ ఫ్లాట్‌లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. నిందితుడు అప్పుడప్పుడు ఏదో ఒక సాకుతో బాధితురాలి నుంచి రూ.19 లక్షలు తీసుకున్నాడు. అయితే రూ.14.61 లక్షలు తిరిగిచ్చాడు. తన భర్తను విడిచిపెట్టమని బాధితురాలిని వేదించాడు. విడిచిపెట్టకపోతే బాధితురాలిని చంపుతానని నిందితుడు బెదిరించాడని తెలిపారు.
ఈ క్రమంలో బాధితురాలు ముంబై సమీపంలోని పంత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మొదట ఫిర్యాదు చేసింది. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 376 (రేప్), 376(2)(ఎన్) (పునరావృత అత్యాచారం), 354(ఎ) (లైంగిక వేధింపులు), 354(డి) (వేధించడం), 506(2) (క్రిమినల్ బెదిరింపు), 420 (మోసం) కింద 'జీరో' ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం 2024, జూన్ 23తేదీ శనివారం కేసు నమోదు చేసుకున్న సాన్‌పాడ పోలీసులు విచారణ చేపట్టారు.