మంత్రి ప‌ద‌వికి సిద్ధూ రాజీనామా

మంత్రి ప‌ద‌వికి సిద్ధూ రాజీనామా

కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవ్ జోత్ సింగ్ సిద్ధూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సమర్పించారు. లెటర్ ట్విట్టర్ లో పెట్టారు సిద్ధూ. జూన్ 10 డేట్ తో రాజీనామా లేఖ ఉంది. జూన్ 9న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అహ్మద్ పటేల్ లను కలిశారు. అదే రోజున లెటర్ ఇచ్చినట్టు ట్వీట్ చేశారు. అయితే అదేం లెటర్ అనేది అప్పట్లో క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు  అది రాజీనామా లేఖగా పూర్తి స్పష్టత వచ్చింది. తన రాజీనామాను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు పంపనున్నట్టు మరో ట్వీట్ చేశారు సిద్ధూ.

అమరీందర్ సింగ్ కేబినెట్ లో లోకల్ గవర్నమెంట్, టూరిజం, సాంస్కృతిక శాఖల మంత్రిగా ఉండేవారు సిద్ధూ. అయితే లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా… సిద్ధూ నుంచి ఆ శాఖలను తొలగించి… విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖలను కట్టబెట్టారు. అయితే ఆ శాఖల్లో ఇప్పటివరకు ఛార్జ్ తీసుకోలేదు. తన శాఖల మార్పుపై అసంతృప్తిగా ఉన్న సిద్ధూ… రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.