మా దగ్గర ఓ జవాన్ బందీ.. మావోల లేఖ

మా దగ్గర ఓ జవాన్ బందీ.. మావోల లేఖ

ములుగు: ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి వికల్ప్ పేరుతో లెటర్ ను రిలీజ్ చేశారు. జీరగూడెంలో భద్రతా బలగాల మీద దాడి చేసింది తామేనని ప్రకటించారు. అయితే పోలీసులు తమకు శత్రువులు కాదన్నారు.

'ఈ ఘటనలో 23 మంది జవాన్లు చనిపోయారు. ఒక జవాన్ మా ఆధీనంలో ఉన్నారు. ఈ ఎన్ కౌంటర్ లో సురేష్, ఓడి సన్నీ, లక్మా, భద్రు (నక్సల్స్) అనే మావోయిస్టులు చనిపోయారు. మేం సన్నీ మృతదేహాన్ని తీసుకెళ్లలేకపోయాం. అమరులైన పోలీసు కుటుంబాలకు మా సంతాపం తెలియజేస్తున్నాం. మేం పోలీసులకు వ్యతిరేకం కాదు, ఫాసిస్టు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం. విస్పష్టమైన విధానంతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం. మధ్యవర్తుల పేర్లు ప్రకటిస్తే మా దగ్గర ఉన్న పోలీసును అప్పగిస్తాం' అని ఆ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు.