లేడీ సూపర్ స్టార్ నయనతార వెడ్డింగ్ టీజర్

లేడీ సూపర్ స్టార్ నయనతార వెడ్డింగ్ టీజర్

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుని... అద్భుత నటనతో రాణిస్తున్న స్టార్ హీరోయిన్ నయనతార. హీరోలకు ఏమాత్రం తగ్గకుండా తన నటనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న నయన్.. ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.  గత కొన్ని రోజుల క్రితమే ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ఈ ముద్దుగుమ్మ ప్రేమించి పెళ్లాడింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి సినీ ప్రముఖులంతా వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే. 

నయన్ విఘ్నేష్ లపెళ్లి వేడుకను ప్రేక్షకులు వీక్షించడానికి ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరి పెళ్లి వేడుకను కూడా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ క్రమంలో దానికి సంబంధించిన టీజర్ ను  నెట్ ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నయన్, విగ్నేష్ ఇద్దరూ తమ ప్రేమతోపాటు ఒకరి గురించి ఒకరు తమ అభిప్రాయాలను పంచుకోవడాన్ని గమనించవచ్చు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)