లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) భర్త విగ్నేష్ శివన్(Vignesh Shivan) తో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నయన్ తన భర్త విఘ్నేష్ శివన్ బర్త్డే స్పెషల్గా క్రేజీ రొమాంటిక్ డిన్నర్‌కి ప్లాన్ చేసింది. ఇక అర్ధరాత్రి ఈ జంట రెస్టారెంట్‌లో ముద్దులు పెట్టుకుంటున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
బుధవారం సెప్టెంబరు 18 న డైరెక్టర్ విగ్నేష్ శివన్ 39వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇక ముందురోజు నైట్ నయన్ తన భర్తకి బ్యూటీఫుల్ మెమరీ ఇచ్చేందుకు రొమాంటిక్ డిన్నర్‌కి ప్లాన్ చేసి ముద్దుల వర్షం కురిపించింది.
ఈ క్రమంలో బ్యూటీఫుల్ ఫొటోస్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తూ.." నా సర్వస్వం అయిన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు..పదాలు వివరించలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను..జీవితంలో మీరు కోరుకునే ప్రతిదానికి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు" అంటూ నయన్ విషెష్ తెలిపింది.
ఈ రొమాంటిక్ డిన్నర్ ఫొటోల్లో పక్కపక్కనే కూర్చుని నవ్వులూ పూయిస్తూ ఈ జంట కెమెరాకి ఫోజులిచ్చింది. అలాగే నయనతార, భర్త విఘ్నేష్ కి విషెష్ చెబుతూ ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నారు. ఇకపోతే డిన్నర్‌ని ఈ జంట బాగా ఆస్వాదిస్తున్నట్లు ఆ ఫొటోల్లో కనిపిస్తోంది.
విఘ్నేశ్ శివన్ను ప్రేమించి 2022 జూన్ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకుంది నయన్. వారికి ఇద్దరు పిల్లలు ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలు ఉన్నారు. వీరిద్దరూ కూడా సరోగసీ ద్వారా జన్మించారు.
ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె.. ప్రస్తుతం ఆమె ది టెస్ట్(The Test) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో సిద్దార్థ్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మలయాళం సినిమాలో నటిస్తోంది. కొత్త దర్శకులు సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్ దర్శకత్వంలో డియర్ స్టూడెంట్స్ అనే చిత్రంలో నటిస్తోంది.
Happiest Birthday to the one and only @VigneshShivN 🎂 God Bless😇 Have a great Year ahead⚡️ pic.twitter.com/vuJtmIbpm7
— Nayanthara✨ (@NayantharaU) September 17, 2024