NBFC ల సంక్షోభానికి తెరపడింది.. కానీ సమస్యలున్నాయ్!

NBFC ల సంక్షోభానికి తెరపడింది.. కానీ సమస్యలున్నాయ్!
  • పూర్తి పరిష్కారానికి ఇంకా ఏడాది
  • 21 శాతం పెరిగిన హెచ్ ఎఫ్ బ్యాంక్ షేరు
  • HDFC బ్యాంక్ ఎండీ ఆదిత్య పురి

నాన్ బ్యాంక్‌ ఫైనాన్స్‌ కంపెనీల(ఎన్‌‌‌‌బీ ఎఫ్‌‌‌‌సీ ) సంక్షోభానికి తెరపడినప్పటికీ, దాని వల్ల ఏర్పడిన ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఇంకా ఏడాది సమయం పడుతుందని హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ ఎండీ ఆదిత్య పురి చెప్పారు. కఠినతరమైన రెగ్యులేటరీ నిబంధనలు, ఆస్తుల అమ్మకాలు ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీ సంస్థలను ఈ సంక్షోభం నుంచి బయటపడేశాయని  పేర్కొన్నారు. ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌ దిగ్గజం ఐఎల్‌ అండ్ ఎఫ్‌‌‌‌ఎస్ లిమిటెడ్ కుప్పకూలడంతో నాన్ బ్యాంక్ ఫైనాన్స్ సంస్థలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. వీటికి కనీసం నిధులు కూడా దొరకలేదు. ఈ మేరకు ఆయన ఒక జాతీయ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలన్నీ ఆయన మాటల్లోనే…

ముంబై : ఎన్ బీఎఫ్​సీ ల సంక్షోభం వీడినప్పటికీ,ఈ రంగంలో లిక్విడిటీ సమస్యలు పూర్తిగా పరిష్కారమవ్వాలంటే ఇంకా 12 నుం చి 18 నెలలు పడుతుం ది. ఇదేమీ లేమాన్‌‌‌‌ బ్రదర్స్‌ లాంటిది కాదు. లేమాన్‌‌‌‌ కుప్పకూలడంతో అది అంటువ్యాధిలా సిస్టమ్ అంతా వ్యాపించింది. దశాబ్దం క్రితం లేమాన్ అంతర్జాతీయ ఫైనాన్స్ రంగంలో సృష్టించిన సునామీని ఆయన గుర్తు చేశారు. లేమాన్‌‌‌‌ కుప్పకూలడంతో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థంతా అతలాకుతలమైం ది. లేమాన్‌‌‌‌ సంక్షోభం ముగిసిం ది. కానీ ఇంకా దాని సమస్య అలానే ఉంది. ఐఎల్‌ అండ్ఎఫ్‌ ఎస్ సంక్షోభం బయటపడ్డ తర్వాత ఇండియా షాడో లెండర్లుగా పేరున్న ఎన్‌‌‌‌బీఎఫ్‌సీ ల తప్పుడు ధోరణులు వెలుగులోకి వచ్చాయి. గత మూడేళ్లలో అన్ని కొత్త రుణాల్లో మూడోవంతు ఈ లెండర్లవే ఉన్నాయి. ఈ సంక్షోభం నుంచి బయట పడటానికి ప్రభుత్వం ఐఎల్‌ అండ్ ఎఫ్‌ ఎస్‌‌‌‌ మేనేజ్‌ మెంట్‌ ను తన ఆధీనంలోకి తీసుకుంది. అయినా ఈ షాడో లెండర్లు తీవ్ర క్రెడిట్ క్రంచ్‌ ను ఎదుర్కొన్నాయి.దీంతో ఆటో మొబైల్స్ వంటి గూడ్స్‌ కు డిమాండ్ తగ్గింది. ఈ షాడో బ్యాంక్‌ లు ఇప్పటికీ నిధులను సేకరించడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఎన్‌‌‌‌బీఎఫ్‌ సీల్లో మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు పెట్టాయి. ఈ రంగ రుణాల్లో 46బిలియన్ డాలర్లు మ్యూచువల్ ఫండ్స్‌ వేనని క్రెడిట్ సూజ్ గ్రూప్ ఏజీ అంచనా వేసింది. ఎన్‌‌‌‌బీఎఫ్‌ సీ లకు,వాటి సంబంధిత సంస్థలకు హెచ్‌ డీఎఫ్‌ సీ బ్యాంక్ కూడా 7 బిలియన్ డాలర్లను ఇచ్చిం ది. ఐసీఐసీఐ బ్యాంక్ 11 బిలియన్ డాలర్లను అందించిం ది.అయితే ఐఎల్‌ అండ్ ఎఫ్‌ ఎస్‌‌‌‌కు ఎలాంటి రుణాలను హెచ్‌ డీఎఫ్‌ సీ బ్యాంక్ ఇవ్వలేదు.

మార్కెట్ క్యాప్ బాగా పెరిగింది…

పురి నేతృత్వం లో మొండి బకాయిల సమస్య నుంచి హెచ్‌ డీఎఫ్‌ సీ బ్యాంక్ బయట పడగలిగింది.దీంతో 2014 నుంచి ప్రతేడాది బ్యాంకింగ్ ఇండెక్స్‌ లో ఈ బ్యాంక్ షేర్లు మంచి ప్రదర్శన కనబరుస్తూ వచ్చాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పెరిగిం ది. ఎస్‌‌‌‌బీఐతో పోలిస్తే, హెచ్‌ డీఎఫ్‌ సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రెండింతలకు పైగా పెరిగిం ది. గత 12 నెలల్లో ఈ బ్యాంక్ షేరు 21 శాతం లాభపడింది. బీఎస్‌‌‌‌ఈ బ్యాంకెక్స్ ఇండెక్స్‌ పెరిగిన 16.6 శాతం కంటే కూడా ఇది అధికం. ఎన్‌‌‌‌పీఏ సమస్యలను డీల్ చేసే విషయంలో దేశీయ బ్యాంకింగ్ ఇండస్ట్రీ గణనీయమైన  పురోగతి సాధించిందని పురి చెప్పారు . దివాలా చట్టం అమలు తర్వాత రుణాలు తీసుకునే కంపెనీలు చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నాయని చెప్పారు.

ఇలాంటి చర్యలే మొండి బకాయిల సమస్యలను ఎదుర్కొంటున్న ప్రభుత్వం రంగ బ్యాంక్‌లకు ప్రభుత్వం క్యాపిటల్‌ అందించేందుకు దోహదం చేస్తున్నాయి. మొం డి బకాయిల్లో 90 శాతం వరకు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లవే ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వ బ్యాంక్‌లకు కేంద్రం గత రెండేళ్లలో 28 బిలియన్ డాలర్ల క్యాపిటల్‌ ను అందించింది. ఈ ఏడాది మరో 3.5 బిలియన్ డాలర్ల క్యాపిటల్ బ్యాంక్‌ లకు కావాల్సి ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనావేస్తోం ది. ఇప్పటి వరకైతే ఆర్థిక వృద్ధికి కావాల్సినంత నగదు ఉందని చెప్పారు . ఒకవేళ ప్రైవేట్ రంగంలోకి కూడా కొత్తగా క్యాపిటల్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ వస్తే, డిమాండ్‌ సామర్థ్యం కన్నా కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆదిత్య పురి వివరించారు.