సికింద్రాబాద్, వెలుగు : సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్లోని అడ్వెంచర్ వింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గ్రూప్ ఎన్సీసీ క్యాడెట్లకు పారా సెయిలింగ్‌పై ట్రైనింగ్ఇస్తున్నారు. శిక్షణలో పాల్గొన్న ఎన్సీసీ క్యాడెట్లు బుధవారం పరేడ్‌గ్రౌండ్‌లో పారాచ్యూట్లతో విన్యాసాలు చేశారు. పారాసెయిలింగ్ మానసిక ధైర్యాన్ని పెంపొందిస్తుందని ట్రైనర్లు చెప్పారు.
