పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇప్పటికే విడుదలైన దేఖ్ లేంగే సాలా, ఆరా ఆఫ్ ఉస్తాద్ పాటలకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లోకి మరో మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ ఎంటర్ అయ్యాడు. ఈ చిత్రానికి తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నాడని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో అనుకున్న సమయానికి దేవిశ్రీకి రీల్స్ పంపడంలో ఆలస్యమైందని చెప్పారు.
ఇప్పటికే తను కమిట్ అయిన ఇతర ప్రాజెక్ట్‌ల వల్ల ఈ సినిమాకు తను సమయం కేటాయించలేకపోతున్నారని, పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్, ఓజీ చిత్రాలకు తమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.
ఇద్దరు క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్‌తో రాబోతున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు మరిచిపోలేని జ్ఞాపకంగా నిలుస్తుందని నిర్మాతలు వెల్లడించారు. మార్చి 26న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే ‘టాక్సిక్’ వాయిదా పడిన క్రమంలో మార్చి 19కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
