ఓవైపు దర్శకుడిగా ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ తెరకెక్కిస్తున్న తరుణ్ భాస్కర్.. మరోవైపు నటుడిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో అతను హీరోగా నటించిన ‘గాయపడ్డ సింహం’ విడుదల కానుంది. ఇదిలా ఉంటే తను కీలకపాత్ర పోషించిన ‘క్రేజీ కళ్యాణం’ చిత్రం నుంచి హోలీ శుభాకాంక్షలతో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో సూపర్ మ్యాన్ తరహాలో క్రేజీగా కనిపిస్తున్న తరుణ్ భాస్కర్.. బాల్ రాజ్ అనే పాత్ర పోషిస్తున్నాడు.
అతనితో పాటు నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి నటిస్తున్న ఈ చిత్రానికి బద్రప్ప గాజుల దర్శకుడు. బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
