ఫేక్ న్యూస్ లో ఏపీ టాప్... భారీగా పెరిగిన నేరాలు.. NCRB రిపోర్ట్ లో సంచలన విషయాలు...

ఫేక్ న్యూస్ లో ఏపీ టాప్... భారీగా పెరిగిన నేరాలు.. NCRB రిపోర్ట్ లో సంచలన విషయాలు...

ఫేక్ న్యూస్ లో ఏపీ టాప్ ప్లేస్ లో ఉందంటూ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ( NCRB 2024 ) రిపోర్ట్ వెల్లడించింది. వ్యక్తిగత దూషణలు, వదంతుల వ్యాప్తిలో ఏపీ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపింది NCRB. సోషల్ మీడియా ద్వారా రాజకీయ ప్రత్యర్థులు, వారి కుటుంబసభ్యులు, మహిళలపై అనుచిత వ్యాఖ్యల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని పేర్కొంది. అంతే కాకుండా... ఏపీలో మహిళలు చిన్నారులపై నేరాలు, హత్యలు తగ్గాయని.. సైబర్ నేరాలు, వృద్దులపై దాడులు పెరిగాయని పేర్కొంది NCRB.

2024 సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా నేరాలు, శాంతిభద్రతలపై కేంద్ర హోమ్ శాఖ ఆధ్వర్యంలోని NCRB నివేదిక విడుదల చేసింది.ఏపీలో సోషల్ మీడియాలో అత్యధికంగా 40 శాతం ఫేక్ న్యూస్ లపై కేసులు నమోదైనట్లు తెలిపింది NCRB. దేశంలో నమోదైన ప్రతి పది ఫేక్ న్యూస్ కేసుల్లో నాలుగు ఏపీలోనే నమోదమయ్యాయని పేర్కొంది NCRB. 

దేశవ్యాప్తంగా తప్పుడు ప్రచారాలు, వదంతుల వ్యాప్తికి సంబంధించి 483 కేసు నమోదైతే... అందులో ఏపీలోనే 203 కేసులు నమోదైనట్లు తెలిపింది. 2024 ఎన్నికల సమయంలోనే విపరీతంగా ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందినట్లు తెలిపింది NCRB. అంతే కాకుండా వాట్సాప్, ఫేస్ బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వంటి ప్లాట్ ఫామ్స్ ద్వారా అడ్డు అదుపు లేకుండా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయినట్లు తెలిపింది. 

ALSO READ : ఈ ఐదు జిల్లాల్లో పెరగనున్న ఎండలు.. 

2024లో ఏపీలో 2వేల 528 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని..గత ఏడాదితో పోలిస్తే 8శాతం పెరిగినట్లు పేర్కొంది.మానవ అక్రమ రవాణాలో ఏపీ మూడోస్థానంలో ఉన్నట్లు తెలిపింది NCRB