4 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్టు

4 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్టు
  •      ఏ మాత్రం అవకాశం ఉన్నా మేడిగడ్డకు రిపేర్లు: ఉత్తమ్ 

హైదరాబాద్, వెలుగు: కుంగిన మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్​ డ్యామ్​సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక మరో 4 రోజుల్లో సర్కారు చేతికి వస్తుందని నీటి పారుదల మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి చెప్పారు. ఆ నివేదికలోని అంశాల ఆధారంగానే మేడిగడ్డ విషయంలో ముందుకెళ్తామని తెలిపారు. ఏ మాత్రం  అవకాశం ఉన్నా రిపేర్లు చేసి, వచ్చే వానాకాలం నాటికి బ్యారేజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తు న్నామన్నారు.

 కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ ​కమిషన్ ​చైర్మన్ ​జస్టిస్ ​పీసీ ఘోష్​తో గురువారం బీఆర్కే భవన్​లో ఉత్తమ్ సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం అనంతరం మీడియాతో ఉత్తమ్ మాట్లాడుతూ.. విచారణ తొలి రోజు కావడంతో ఘోష్​ను మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. కాళేశ్వరంపై నిజా నిజాలు వెలికితీసేందుకే జ్యుడీషియల్​ కమిషన్​ వేశామని తెలిపారు.