లాక్డౌన్ వల్ల ఒక్క ఊరులోనే 1600 పెళ్లిళ్లు వాయిదా

లాక్డౌన్ వల్ల ఒక్క ఊరులోనే 1600 పెళ్లిళ్లు వాయిదా

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు దేశ ప్రధాని మోడీ లాక్డౌన్ ప్రకటించారు. మొదట ఈ లాక్డౌన్ ఏప్రిల్ 14 వరకు అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. కానీ.. కరోనా దేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుండటంతో మే 3 వరకు ఈ లాక్డౌన్ ను పొడిగిస్తున్నట్లు మోడీ ఏప్రిల్ 14న మీడియా సమావేశంలో తెలిపారు. ప్రతి వేసవిలో పెళ్లిళ్లు చాలా ఎక్కువగా జరుగుతాయి. కానీ, లాక్డౌన్ వల్ల మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగాల్సిన పెళ్లిళ్లన్నీ వాయిదా పడ్డాయి. దాంతో చాలామంది లాక్డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుందని భావించి.. ఆ తర్వాత పెళ్లిళ్లు చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ, లాక్డౌన్ గడువు పెరగడం వల్ల చాలా పెళ్లిళ్లు మళ్లీ వాయిదా పడ్డాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని ఒక్క లక్నోలోనే దాదాపు 1600 పెళ్లిళ్లు వాయిదా పడ్డట్లు సమాచారం. లాక్డౌన్ వల్ల ఫంక్షన్ హాళ్లు, పూల షాపులు, ఇలా పెళ్లిళ్లకు కావలసిన అన్ని షాపులు మూతపడటంతో పెళ్లిళ్లన్నీ ఆగిపోయాయి.

దేశం మొత్తం మీద 16,365 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో 521 మంది చనిపోగా.. 2466 మంది కోలుకున్నారు.

For More News..

ఏప్రిల్ 20 తర్వాత కూడా లాక్డౌన్ సడలించం