
బషీర్బాగ్, వెలుగు: సిటీలో ఛట్ పూజను ఈ నెల 27, 28 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు జన్ సేవా సంఘ్ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ సహాయంతో దాదాపు 30 ఘాట్లలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు అర్పిసింగ్, ట్రెజరర్ వినిత్ సింగ్ తెలిపారు.
నెక్లెస్ రోడ్లో జరిగే వేడుకల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బుధవారం వారు మాట్లాడారు. ఈ నెల 27న మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 వరకు, 28న సాయంత్రం 4 గంటల నుంచి 7వరకు సూర్య భగవానుడికి నదీ, సరస్సు ఒడ్డున ప్రార్థనలు చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు.
మొదటి రోజు నహై-బాయ్ (స్నానం చేయడం, తినడం), రెండో రోజు ఖర్నా (ఉపవాసం, చిన్న ఆహారం) ఉంటుందన్నారు. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను ఆహ్వానించినట్లు తెలిపారు.