సాయి సుదర్శన్ చేతికి టేప్ వేయాల్సిందే..హిట్ వికెట్పై గిల్ ఫన్నీ కామెంట్స్

సాయి సుదర్శన్ చేతికి టేప్ వేయాల్సిందే..హిట్ వికెట్పై గిల్ ఫన్నీ కామెంట్స్

Shubman Gill: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఈ మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో జట్టును గెలిపించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్‌లో గిల్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. 

టాస్ వద్ద డ్రామా.. గిల్ అసంతృప్తి: 
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే టాస్ దగ్గర ఒక చిన్న డ్రామా కొనసాగింది.. టాస్ వేసినప్పుడు రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఏం తీసుకున్నాడో మ్యాచ్ రెఫరీకి సరిగ్గా వినిపించలేదు.. దాంతో రూల్స్ ప్రకారం టాస్ ని రెండోసారి వేయాల్సి వచ్చింది. ఈ రెండో టాస్ లో శుభ్‌మన్ గిల్‌ ఓడిపోయాడు. దీనిపై అతడు మాట్లాడుతూ.. టాస్ సమయంలో అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ జరిగింది, టాస్ ఓడిపోవడం మొదట్లో కాస్త అసంతృప్తి కలిగించినా, చివరికి మ్యాచ్ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.  

సాయి సుదర్శన్‌తో భాగస్వామ్యం: 
మా ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ చాలా బాగుంటుంది.. ఒకరి ఆటను ఒకరం బాగా అర్థం చేసుకుంటామని శుభ్‌మన్ గిల్‌ తెలిపాడు. మేమిద్దరం క్రీజులో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ పక్కాగా ఉంటుంది.. ప్రత్యర్థి బౌలర్లలో ఏ బౌలర్‌ను టార్గెట్ చేయాలి, ఎవరు అటాక్ చేయాలనేది ముందే ప్లాన్ చేసుకుంటామని వెల్లడించాడు. ఆ అవగాహనే మా భాగస్వామ్యాల విజయ రహస్యం అని గిల్ చెప్పుకొచ్చాడు. 

హిట్ వికెట్'పై ఫన్నీ కామెంట్స్: 
సాయి సుదర్శన్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హిట్ వికెట్ కావడంపై శుభ్‌మన్ గిల్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇలాంటి వింత అవుట్‌ను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నాడు. బహుశా ఎవరూ కూడా చూసి ఉండరు.. బ్యాక్ టు బ్యాక్ మ్యాచుల్లో ఒకేలా అవుట్ కావడం నమ్మశక్యం కానిదని.. సోషల్ మీడియాలో ఎవరో సాయి సుదర్శన్ చేతికి టేప్ వేసుకోవాలని ఒక వీడియో షేర్ చేశారని పేర్కొన్నాడు. వచ్చే మ్యాచ్‌లో తానే స్వయంగా అతని చేతికి టేప్ వేయాలేమో అంటూ గిల్ సరదాగా కామెంట్స్ చేశాడు.  

నా ఫోకస్ మొత్తం గ్యాప్స్ పైనే: 
తాను ఒక ప్రత్యేకమైన మైండ్ సెట్‌లో (జోన్‌లో) ఉన్నా.. కేవలం గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి, బౌలర్ ఎక్కడ వేస్తున్నాడు, బంతిని ఎటు కొట్టాలనే దానిపైనే ఫోకస్ పెట్టినట్లు గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ వెల్లడించాడు. బంతిని గట్టిగా బాదాలనే ఆలోచన లేదని.. బంతి ఎక్కడ పడుతుందో చూసి, తన జోన్‌లోకి వస్తే టైమింగ్‌తో షాట్లు ఆడానంతే.. మనం బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గ్రౌండ్‌లో ఫీల్డర్లు ఎవరూ లేనట్లే కనిపిస్తుంది, బంతి కూడా బ్యాట్ మధ్యలో తగులుతుందని గిల్ తెలిపాడు.  

మ్యాచ్ ఫినిష్ చేయలేకపోయాననే బాధ: 
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (96 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో రాజస్థాన్ మొదట 214 రన్స్ భారీ స్కోరు చేసింది. ఇంత పెద్ద ఛేజింగ్‌లో మాకు మంచి ఓపెనింగ్ దొరికింది. అయితే మ్యాచ్‌ను నేనే స్వయంగా పూర్తి చేయాలనుకున్నా.. కానీ సెంచరీ అయ్యాక అలా అవుట్ అవ్వడం కొంచెం బాధగా అనిపించిందని వెల్లడించాడు. 

బౌలింగ్ ఆప్షన్స్, ఫైనల్స్ పై ధీమా
ఫైనల్‌గా గుజరాత్ టీమ్ బౌలింగ్ ఆప్షన్స్ గురించి శుభ్‌మన్ గిల్‌ తెలియజేశాడు. తమ జట్టులో చాలా మంది అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. తమకు 6 నుంచి 7 బౌలింగ్ ఆప్షన్స్ ఉందని స్పష్టం చేశాడు. అందుకే సాయి కిషోర్‌కు ఒక ఓవర్ వేసే ఛాన్స్ కూడా రాలేదన్నాడు. తమ బ్యాటింగ్ లైనప్ సైతం చాలా డీప్‌గా ఉంది, ఇప్పుడు తామంతా ఫైనల్ మ్యాచ్ కోసం రెడీగా ఉన్నామని గిల్ ధీమా వ్యక్తం చేశాడు.