న్యూఢిల్లీ: ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కీలక బాధ్యతలు చేపట్టాడు. గత రెండు సీజన్లుగా ‘యూబీఎస్ అథ్లెటిక్స్ కిడ్స్ కప్’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన నీరజ్.. ఇప్పుడు అదే సంస్థకు కో ఓనర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. చిన్న వయసు నుంచే చిన్నారులను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు ఈ సంస్థ గ్రాస్‌రూట్ స్థాయి కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఇప్పటి వరకు ఐదు నగరాల్లో 2500కి పైగా స్కూళ్లలో సూమారు రెండున్నర లక్షల మంది పిల్లలను ఈ వేదిక ద్వారా క్రీడలకు పరిచయం చేశారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించి దేశవ్యాప్తంగా లక్షలాది మంది చిన్నారులకు చేరువ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు నీరజ్ తెలిపాడు.
విద్యార్థులు, ఉపాధ్యాయులతో తన అనుభవాలను పంచుకోవడం ద్వారా భవిష్యత్తులో దేశం తరఫున గొప్ప క్రీడాకారులు తయారవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ క్రీడా వేదికలో దాదాపు 50 శాతం మంది బాలికలు భాగస్వాములు కావడం విశేషం.
