
- అనుమతించని పోలీసులు
కీసర, వెలుగు: ఐదు నిమిషాలు లేట్ గా రావడంతో ముగ్గురు విద్యార్థులను నీట్ పరీక్షకు పోలీసులు అనుమతించలేదు. హాల్ టికెట్ పై పరీక్షా కేంద్రం పేరు సరిగ్గా లేకపోవడంతోనే తాము ఇన్టైంకు చేరుకోలేకపోయామని బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా కీసర పరిధిలోని అంకిరెడ్డి పల్లి జ్యోతిబా పూలే బాలికల గురుకులంలో నీట్ ఎగ్జామ్సెంటర్ను అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో ఇక్కడ మూర్తి ఇంజినీరింగ్ కాలేజీ ఉండగా, కొన్నేండ్లుగా ప్రభుత్వం అద్దెకు తీసుకొని గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది.
అయితే, నీట్ హాల్‌టికెట్‌పై ఎగ్జామ్ సెంటర్ పేరును ‘ఉప్పల్ జ్యోతిబా పూలే గురుకులం అంకిరెడ్డిపల్లి, కీసర’ కేరాఫ్మూర్తి ఇంజినీరింగ్ కాలేజీ అని ఉండడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. తొలుత ఉప్పల్‌లో ఎగ్జామ్సెంటర్ కోసం వెతికారు. తీరా అసలు విషయం తెలుసుకొని కీసరకు రాగా, అప్పటికే ఐదు నిమిషాలు లేట్కావడంతో పోలీసులు లోపలికి
అనుమతించలేదు.