న్యూఢిల్లీ: నీట్ పరీక్షలో 720 మార్కులకు 715 మార్కులు సాధించి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఆర్యన్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం, విమర్శించడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని పేర్కొన్నారు. పరీక్ష రద్దు వార్త వినగానే తీవ్ర నిరాశకు గురయ్యానని, వెక్కి వెక్కి ఏడ్చేశానని ఆర్యన్ తెలిపాడు. అయితే ఇది తన ఒక్కడికి జరిగిన అన్యాయం కాదని, 22 లక్షల మంది అభ్యర్థుల పరిస్థితి ఇదేనని గుర్తించి మరుసటి రోజే మళ్లీ చదవడం మొదలుపెట్టినట్లు చెప్పాడు.
