నీట్ రీఎగ్జామ్ ‘కీ’ విడుదల

నీట్ రీఎగ్జామ్ ‘కీ’ విడుదల
  • 28 వరకు అభ్యంతరాల స్వీకరణ

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 21న నిర్వహించిన నీట్ యూజీ-2026 రీ-ఎగ్జామినేషన్‌‌‌‌ కు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ‘కీ’ని అధికారిక వెబ్‌‌‌‌సైట్ https://neet.nta.nic.in/ లో చూసుకోవచ్చని సూచించింది.

‘కీ’లో ఏవైనా తప్పులు ఉంటే 28న రాత్రి 11:50 గంటల వరకు ఆన్‌‌‌‌ లైన్ ద్వారా చాలెంజ్ చేసే అవకాశం కల్పించింది. ప్రతి అభ్యంతరానికి రూ.200 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థి అభ్యంతరం సరైనదని సబ్జెక్ట్ నిపుణుల కమిటీ నిర్ధారిస్తే, ఫీజును పూర్తిగా రీఫండ్ చేస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. క్వశ్చన్ పేపర్ సిరీస్ కోడ్‌‌‌‌ కు తగ్గట్టుగానే అభ్యంతరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.