NEET UG 2024 Results: విద్యార్థులకు గుడ్ న్యూస్: NEET యూజీ ఫలితాలు విడుదల

NEET UG 2024 Results: విద్యార్థులకు గుడ్ న్యూస్: NEET యూజీ ఫలితాలు విడుదల

NEET UG 2024 Results: ఎట్టకేలకు NEET యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష కేంద్రాల వారీగా నీట్ -యూజీ ఫలితాలు విడుదల చేశారు NTA అధికారులు. ఫలితాలు ఇప్పుడు అధికారిక NEET UG 2024 వెబ్  సైట్ లో అప్ లోడ్ చేశారు. 

నీట్ -యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 40కిపైగా పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. దీంతో నీట్ -యూజీ ఫలితాలను నగరాలు, పరీక్ష కేంద్రాల వారీగా విడుదల చేయాలని NTAను సుప్రీంకోర్టు ఆదేశించింది. మిగతా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్ష కేంద్రాల్లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయా? లేదా? అని తెలుసుకోవడానికే ఈ జాబితాను కోరుతున్నామని తెలిపింది. ఈమేరకు...నీట్ -యూజీ ఫలితాలను కేంద్రాల వారీగా విడుదల చేసింది NTA.