వరల్డ్‌‌‌‌ బాక్సింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో నీతు, స్వీటీ ఫైనల్‌‌‌‌ బౌట్స్

వరల్డ్‌‌‌‌ బాక్సింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో నీతు, స్వీటీ  ఫైనల్‌‌‌‌ బౌట్స్

న్యూఢిల్లీ:  సొంతగడ్డపై వరల్డ్‌‌‌‌ బాక్సింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌ చేస్తున్న ఇండియా అమ్మాయిలు ఆఖరి పంచ్‌‌ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మెగా టోర్నీలో తెలంగాణ స్టార్‌‌ నిఖత్‌‌ జరీన్‌‌ సహా నలుగురు ఫైనల్‌‌ చేరుకున్నారు. శనివారం జరిగే టైటిల్‌‌ ఫైట్స్‌‌లో నీతు గాంగాస్‌‌, స్వీటీ బూర గోల్డ్‌‌ మెడల్‌‌ వేటలో నిలిచారు. 48 కేజీ ఫైనల్‌‌ బౌట్‌‌లో నీతు.. మంగోలియాకు చెందిన లుత్సయిఖాన్‌‌ తో అమీతుమీ తేల్చుకోనుంది. 81 కేజీ బౌట్‌‌లో స్వీటీ.. చైనాకు చెందిన లాంగ్‌‌ లినాతో పోటీ పడనుంది. నిఖత్‌‌, లవ్లీనా ఫైనల్‌‌ బౌట్స్‌‌ ఆదివారం జరుగుతాయి.