నేపాల్ విమాన ప్రమాదం.. 14 మృతదేహాల వెలికితీత

నేపాల్ విమాన ప్రమాదం.. 14 మృతదేహాల వెలికితీత

నేపాల్ లో కూలిపోయిన విమాన ప్రమాదంలో 14 మంది మృతదేహాలను బయటకు తీశారు. 22 మందితో వెళుతున్న ఈ విమానం హిమాలయ పర్వతాల్లో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆదివారం ఈ ఘటన చోటు చేసుకున్నప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. సోమవారం విమానం పడిన ప్రాంతాన్ని గుర్తించారు. ప్రాణాలతో బయటపడే అవకాశం చాలా తక్కువగా ఉందని నేపాల్ సివిల్ ఏవియేషన్ అథార్టీ ప్రతినిధి దేవ్ చంద్రలాల్ కర్ణ వెల్లడించారు. ఇప్పటి వరకు 14 డెడ్ బాడీస్ ను వెలికి తీయడం జరిగిందని రాజధాని ఖాట్మండు లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధి Tek Raj Sitaula తెలిపారు. ఇతరుల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. నేపాల్​ తారా ఎయిర్​లైన్స్​కు చెందిన 9 DHC-6-300 Twin Otter విమానం ఖాట్మండుకు పశ్చిమాన 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోఖరా నుంచి ఆదివారం ఉదయం బయలుదేరింది.
 

ఈ విమానంలో నలుగురు భారతీయులు, ఇద్దరు జర్మన్లు, 16 మంది నేపాలీ దేశస్థులున్నారు. ల్యాండ్ కావడానికి ఐదు నిమిషాల ముందు ఫోఖారా (Pokhara) కంట్రోల్ టవర్ తో సంబంధాలు తెగిపోయినట్లు, ధౌలగిరి పర్వతం ఉన్న ప్రాంతంలో విమానం క్రాష్ అయినట్లు ఎయిర్ లైన్స్ అధికారులు గుర్తించారు. నేపాల్ సైన్యానికి చెందిన సైనికులు, ఇతర రెస్క్యూ వర్కర్లు దాదాపు 14 వేల 500 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతంపై పని చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు బాగా లేవని, మృతదేహాల కోసం గాలింపు చేస్తున్నామన్నారు. 2018లో ఢాకా నుంచి ఖాట్మండుకు వెళ్లిన యూఎస్ (US) బంగ్లా ఎయిర్ లైన్స్ విమానంలో 71 మంది ప్రయాణీకులున్నారు. క్రాష్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 51 మంది మరణించారు.

మరిన్ని వార్తల కోసం :-
నేపాల్లో విమానం మిస్సింగ్


నేపాల్ లో కూలిన విమానం.. 22 మంది మృతి !