హాంకాంగ్ సిక్సర్స్‌లో టీమిండియాకు నేపాల్ ఊహించని షాక్ ఇచ్చింది. ఆరు ఓవర్ల మ్యాచ్ లో ఏకంగా 92 పరుగుల తేడాతో భారత జట్టును చిత్తుగా ఓడించింది. శనివారం (నవంబర్ 8) జరిగిన ఈ మ్యాచ్ లో మొదట విఫలమైన భారత జట్టు.. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ పోరాడకుండానే చేతులెత్తేశారు. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ వికెట్ నష్టపోకుండా నిర్ణీత 6 ఓవర్లలో 137 పరుగులు చేసింది. 138 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు 3 ఓవర్లలోనే 45 పరుగులకు ఆలౌట్ అయింది. ఇప్పటికే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన భారత జట్టు నేపాల్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ వికెట్ నష్టపోకుండా నిర్ణీత 6 ఓవర్లలో 137 పరుగులు చేసింది. ఓపెనర్లు సందీప్ జోరా 12 బంతుల్లోనే 47 పరుగులు చేసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ రషీద్ ఖాన్ 17 బంతుల్లో 55 పరుగులు చేసి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో లోకేష్ బామ్ 7 బంతుల్లోనే 31 పరుగులు చేసి నెక్స్ట్ లెవల్ ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో ప్రతి ఒక్కరు ఓవర్ కు 18కి పైగా పరుగులు సమర్పించుకున్నారు. నేపాల్ జట్టు ఒక్క వికెట్ వికెట్ కూడా పడగొట్టలేకపోయారు.
138 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు నిర్ణీత 6 ఓవర్లు కూడా ఆడలేకేపోయింది. 3 ఓవర్లలోనే 45 పరుగులకు ఆలౌట్ అయింది. రాబిన్ ఉతప్ప 5 పరుగులే చేసి ఔట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. కెప్టెన్ దినేష్ తన పేలవ ఫామ్ కొనసాగిస్తూ 7 పరుగులే చేసి నిరాశపరిచాడు. బిన్నీ డకౌట్ అయితే పంచల్ 12 పరుగులతో సరిపెట్టుకున్నాడు. దీంతో భారత జట్టుకు ఘోర ఓటమి తప్పలేదు. నేపాల్ బౌలర్ రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసుకొని ఇండియాకు బిగ్ షాక్ ఇచ్చాడు.
🚨 Nepal defeated India by 92 runs in the Hong Kong Sixes! 🤯🇳🇵🇮🇳#HongKongSixes pic.twitter.com/LNT87Wre1H
— ICC Asia Cricket (@ICCAsiaCricket) November 8, 2025
