లేట్గా వచ్చినా సాలిడ్ రికార్డ్ కొట్టేసింది.. అది విక్రమ్ రేంజ్

లేట్గా వచ్చినా సాలిడ్ రికార్డ్ కొట్టేసింది.. అది విక్రమ్ రేంజ్

చియాన్ విక్రమ్(Chiyan Vikram) లేటెస్ట్ మూవీ ధృవనక్షత్రం(Dhruva Natchathiram) మూవీ సాలిడ్ రికార్డ్ కొట్టేసింది. అది కూడా రిలీజ్ కు ముందే. తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్(Gautham Vasudev Menon) మీనన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా చాలా కాలం క్రితమే షూటింగ్ కంప్లీట్ అయినా.. వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా రిలీజ్ అవుతుందా కాదా అని చాలా మంది అనుకున్నారు. ఎట్టకేలకు ఇటీవలే రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకుంది ఈ మూవీ. 

రీతూవర్మ, సిమ్రన్‌, పార్తిబన్ ప్రధాన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు పార్ట్స్ గా 
వస్తున్న ఈ సినిమా రెండో పార్ట్ వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుంది. తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేంటంటే.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ధృవనక్షత్రం డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ నలభై కోట్ల భారీ ధరకు దక్కించుకుకుందట. 

ఇక ధృవనక్షత్రం సినిమాను రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు మేకర్స్. అందులో సగానికి పైగా డిజిటల్ రైట్స్ తోనే రికవరీ కావడంతో ఫుల్ హ్యాపీ గా ఉన్నారు ఈ మూవీ మేకర్స్. ఈ ఒక్క రీజన్ చాలు ఆడియన్స్ లో విక్రమ్ క్రేజ్ ఏ రేంజ్ లోఉందని చెప్పడానికి. ఇది తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి రిలీజ్ కు ముందే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబడుతున్న ఈ సినిమా రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. 

Also Read:-నవంబర్ 21న రాంగ్ యూసేజ్ సాంగ్ విడుదల