హైదరాబాద్‌సిటీ, వెలుగు: హైదరాబాద్ నుంచి మరో అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను నడిపేందుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం సిటీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆరు అమృత్ భారత్ రైళ్లు నడుస్తుండగా, తాజాగా ఏడో రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కొత్త ట్రైన్ చర్లపల్లి – గోరఖ్‌పూర్ (ట్రైన్ నంబర్ 22075), గోరఖ్‌పూర్ – చర్లపల్లి (ట్రైన్ నంబర్ 22076) మధ్య రాకపోకలు సాగించనుంది. తక్కువ చార్జీలతో నాన్-ఏసీ సూపర్ ఫాస్ట్ సర్వీస్‌గా కేంద్ర ప్రభుత్వం ఈ రైలును రూపొందించింది.
ఇందులో సాధారణ నాన్-ఏసీ స్లీపర్ కోచ్‌లతో పాటు జనరల్ కోచ్‌లు, అన్ రిజర్వ్‌డ్ స్లీపర్ క్లాస్ కోచ్‌లను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచారు. ఈ నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ అక్టోబరు 2వ,4వ తేదీల్లో చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి గోరఖ్‌పూర్‌కు బయలుదేరనుంది.
