ఎన్ఐఏకు కొత్త బాస్.. మహారాష్ట్ర ఐపీఎస్ ఆఫీసర్ సదానంద్​కు బాధ్యతలు

ఎన్ఐఏకు కొత్త బాస్..  మహారాష్ట్ర ఐపీఎస్ ఆఫీసర్ సదానంద్​కు బాధ్యతలు

 న్యూఢిల్లీ : నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కి ప్రభుత్వం కొత్త బాస్ ను నియమించింది. మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ చీఫ్ సదానంద్ వసంత్ దాతె ను ఎన్ఐఏ డీజీగా నియమిస్తూ అపాయింట్ మెంట్ కమిటీ ఆఫ్​క్యాబినెట్ (ఏసీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన సదానంద్ దాతె మహారాష్ట్ర కేడర్ కు చెందిన వారు. ఆయన నియామకం ఈ నెల 26 (మంగళవారం) నుంచే అమలులోకి వస్తుందని పర్సనల్ డిపార్ట్ మెంట్ ఉత్తర్వుల్లో పేర్కొంది.

 2026 డిసెంబర్ 31 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా, 1990 బ్యాచ్ కు చెందిన మరో ఐపీఎస్ అధికారి రాజీవ్ కుమార్ శర్మ (రాజస్థాన్ కేడర్) ను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కు డైరెక్టర్ జనరల్ గా  ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఇక, 1991 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్, యూపీ కేడర్ కు చెందిన పీయూష్ ఆనంద్​ ను ఎన్డీఆర్ఎఫ్​చీఫ్ గా నియమిస్తూ ఏసీసీ ఉత్తర్వులు జారీ చేసింది.