కేసీఆర్ కు శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆస్పత్రి కనిపించడం లేదా?

కేసీఆర్ కు శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆస్పత్రి కనిపించడం లేదా?

ఉస్మానియా ఆస్పత్రి ప్రస్తుతం చాలా దయనీయ పరిస్థితిలో ఉందన్నారు బీజేపీ మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. కొత్త బిల్డింగ్ కడుతామని 2010లో జీవో ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. ఉస్మానియ జనరల్ ఆస్పత్రిని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే రాజాసింగ్ విజిట్ చేశారు. ఈ తర్వాత మాట్లాడిన దత్తాత్రేయ.. ఉస్మానియా ఆస్పత్రి పాత బిల్డింగ్ ఎప్పుడు కూలుతుందో తెలియక డాక్టర్లు, పేషేంట్లు భయాందోళన చెందుతున్నారని తెలిపారు. వెయ్యి కోట్లతో వెంటనే కొత్త బిల్డింగ్ నిర్మించడంతో పాటు..సరిపోను మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకోవాలని సూచించారు.

ఉస్మానియాను.. గాంధీ ఆస్పత్రి తరహాలో నిర్మిచాలని ఎన్నో సార్లు ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. 6వందల కోట్లతో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్న కేసీఆర్ కు శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆస్పత్రి ఎందుకు కన్పించడం లేదని ప్రశ్నించారు.