మోదీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు

మోదీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు

నాలుగేళ్ల కాంట్రాక్టు త్వరాత రిటైర్ మెంట్ అయ్యే వేల మంది అగ్నివీరుల భవిష్యత్ ఏంటీ ? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రతి ఏటా 60 వేల మంది సైనికులు పదవీ విరమణ చేస్తున్నారనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అందులో కేవలం 3 వేల మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నట్లు వెల్లడించారు. అయితే.. ప్రధాన మంత్రి ప్రయోగశాలలో చేస్తోన్న నూతన ప్రయోగంతో దేశ భద్రత, యువత భవిష్యత్ కూడా ప్రమాదంలో పడిందన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా హిందీలో ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ‘అగ్నిపథ్’ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు పెల్లుబికాయి.

మోదీ పరిశోధన కేంద్రంలో చేపట్టే నూతన ప్రయోగం వల్ల ప్రమాదం ఏర్పడుతుందని రాహుల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అగ్నిపథ్ విషయంలో యువతలో నెలకొన్న సందేహాలపై పార్లమెంట్ లో చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. త్రివిధ దళాల్లో సైనిక నియామకాలపై కొత్తగా ‘అగ్నిపథ్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వారిని నాలుగేళ్ల కాలపరిమితి కోసం అగ్నివీరులుగా నియమించుకోనుంది. ఇప్పటికే త్రివిధ దళాలు నియామక ప్రక్రియ చేపట్టింది. ఈ నియామక ప్రక్రియను పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.